CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సంబరాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఏకగ్రీవాలు మిన్నంటాయి. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊర్లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. సీఎం సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సర్పంచ్‌గా మాజీ మావోయిస్టు, మల్లేపాకుల వెంకటయ్య (అలియాస్ మోహన్)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ఈ విషయంలో చొరవ తీసుకుని గ్రామస్థులతో చర్చించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి, సర్పంచ్ పోటీకి అనేక మంది…