రాజకీయాల్లో ఎమర్జ్ అయ్యే నేతలు కొందరు.. ప్రజలపై స్పష్టమైన ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటారు. భవిష్యత్ పై క్లియర్ అజెండాతో ముందుకు వెళ్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో.. 3 ప్రధాన పార్టీల్లో.. ముగ్గురు యువనేతలు ఇలాగే రాజకీయాలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. రాబోయే తరానికి కాబోయే రాజకీయ సారథులం మేమే అన్నట్టుగా వారు తమ తమ పార్టీల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అందులో టీఆర్ఎస్ ను గమనిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడిగా.. మంత్రిగా గుర్తింపు తెచ్చుకుని.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి…
తెలంగాణ కాంగ్రెస్ కు మూలస్తంభాలుగా ఉన్న నేతల్లో.. జానారెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుత టీ కాంగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్నా.. వీళ్లందరినీ కలుపుకొని వెళ్తే తప్ప.. పార్టీని ముందుకు తీసుకువెళ్లలేరు. వీళ్లు మాత్రమే కాదు.. రెండో వరసలో.. షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ వంటి నేతలను కూడా రేవంత్ సమన్వయం చేసుకోవాల్సిందే. లేదంటే..…
ఆడవారి మాటలకు అర్థాలే వేరన్నట్టు.. రాజకీయ నేతల మాటలకు అర్ధాలు వేరు. స్టేట్‌మెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. మంత్రి మల్లారెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ మధ్య సవాళ్లూ ఆ కోవలోకే చేరతాయా? రాజీనామాలపై వారి ప్రకటనలు నమ్మొచ్చా.. లేక రాజీడ్రామాలా? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ సీన్ ఇదే. అసలే మంత్రి మల్లారెడ్డి. పక్కా నాటు. ఆయన్ని కెలికారు పీసీసీ చీఫ్ రేవంత్. ఇంకేముందీ మీడియా ముందుకు వచ్చి తొడలు కొట్టారు.. సవాళ్లు విసిరారు మంత్రిగారు. రాజీనామాలపై…
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన దూకుడును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇంద్ర వెళ్లి, రావిలాల లో దళిత,గిరిజన ఆత్మ గౌరవ సభలు నిర్వహించగా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో దళిత,గిరిజన గౌరవ ఆత్మ గౌరవ దీక్ష చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం లోపే ఈ దీక్షను ప్రారంభించనున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అయితే… ఈ దీక్షను ఈ రోజు, రేపు రెండు…
సీఎం కేసీఆర్ పై మరోసారి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూడు చింతలపల్లి గ్రామాన్ని కెసిఆర్ దత్తత తీసుకొని ఏం చేయలేదని మండిపడ్డ రేవంత్ రెడ్డి.. అలాంటి ది తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. అందుకే మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష పెట్టనున్నామని తెలిపారు. ఈ దీక్ష తో కెసిఆర్ గ్రామానికి ఎం చేశాడో ప్రజలకి చూపిస్తామన్నారు. దీక్ష సమయంలో నైట్ దళితుల ఇంట్లోనే పడుకుంటానని తెలిపారు. ఈటెల రాజేందర్ బీజేపీ లో…