రేవంత్ కు.. ‘ఆ టీమ్’ సహాయ నిరాకరణ చేస్తోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ కు మూలస్తంభాలుగా ఉన్న నేతల్లో.. జానారెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుత టీ కాంగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్నా.. వీళ్లందరినీ కలుపుకొని వెళ్తే తప్ప.. పార్టీని ముందుకు తీసుకువెళ్లలేరు. వీళ్లు మాత్రమే కాదు.. రెండో వరసలో.. షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ వంటి నేతలను కూడా రేవంత్ సమన్వయం చేసుకోవాల్సిందే. లేదంటే.. అధికారం అన్న ఆకాంక్షను ఆయన చేరుకోవడం చాలా కష్టం అవుతుంది.
ఇదంతా అందరికీ తెలిసిన విషయమే కానీ.. ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే.. ఓ కీలకమైన విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందునుంటే జానారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడిని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. పొన్నాల లక్ష్మయ్య సైతం ఎక్కువగా మీడియా ముందుకు కూడా రావడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా రాజీనామా చేసిన నాటినుంచే సైడ్ అయిపోయారు.
Also Read
కోమటిరెడ్డి బ్రదర్స్ – రేవంత్ రెడ్డి రిలేషన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. న్యూట్రల్ గా ముందుకు పోతున్నారు. కలిసినప్పుడు కావలించుకోవడం తప్ప.. ఇప్పటివరకూ రేవంత్ కు అండగా మేమున్నామంటూ.. ధైర్యంగా షబ్బీర్, పొన్నం వంటి నేతలు చెప్పిన సందర్భాలు లేవు. కేవలం.. సీతక్క, మధు యాష్కీ, సంపత్, అద్దంకి దయాకర్ వంటి నేతలు తప్ప రేవంత్ పోరాటానికి మద్దతుగా ముందు నిలుస్తున్న నేతలైతే కనిపించడం లేదు.
ఇదంతా చూస్తుంటే.. సీనియర్స్ టీమ్ అంతా సహాయ నిరాకణ చేస్తోందా.. అన్న అనుమానాన్ని కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ చతుర్ముఖ పోటీలో.. కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తే కనీసం 30 నుంచి 40 సీట్లైనా గెలుచుకోవచ్చని పార్టీ కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. కాంగ్రెస్సే కింగ్ మేకర్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి తరుణంలో.. సీనియర్లు ఇలా నాయకత్వానికి దూరంగా ఉంటుండడం.. అంత మంచిది కాదేమో అని ఆందోళన చెందుతున్నారు. రేవంత్ కూడా.. అందరినీ మరోసారి కలుపుకొనిపోయే ప్రయత్నం చేయాలని.. ఈ విషయాన్ని పార్టీ హై కమాండ్ సైతం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని.. పార్టీ శ్రేణులు ఓపెన్ గానే ఒపీనియన్ చెబుతున్నారు. మరి.. వారు ఆశించిన మార్పు కనిపిస్తుందా? చూద్దాం.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!