గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. తాజాగా.. విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఓ పోలీసు అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ వెల్లడించింది.
గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. శాంతి చర్చల సమయంలో కూడా రెండు దేశాల సైన్యాలు వెనక్కితగ్గడం లేదు. అలాగే దాడులను కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపడానికి.. పుతిన్ తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ అందుకోసం పలు షరతును విధించినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది.