పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యంగా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. దీంతో భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం నుంచి పెర్త్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ బీసీసీఐకి తెలియజేసాడు. అతను ఇటీవలే రెండోసారి తండ్రైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. కాగా.. రోహిత్ గైర్హాజరీలో జట్టు వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు.
తెలంగాణ కేడర్ కావాలని విజ్ఞప్తి చేసిన 11మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు కేంద్రం నో చెప్పింది. ఈ 11 మంది అధికారులు వెంటనే సొంత రాష్ట్రంలోనే రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డీఓపీటీ (DOPT) ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలి.. తనకు తెలంగాణ కేడర్ కావాలని కోరింది. దీనిపై సమీక్షించిన డీఓపీటీ.. తెలంగాణ కేడర్ ను కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు…
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మధ్యంతర బెయిల్ ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తీహార్ జైలుకు తిరిగి వెళ్లన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. అయితే చివరి దశ పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత లొంగిపోవాలని కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఊరట లభించలేదు.
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక లైంగిక వేధింపుల వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలను లైంగికంగా వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.