సోమవారం వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. తిలక్ వర్మ (56; 29 బంతుల్లో 4×4, 4×6), హార్దిక్ పాండ్యా (42; 15 బంతుల్లో 3×4, 4×6)లు పోరాడినా సొంత మైదానంలో ముంబైకి ఓటమి తప్పలేదు. లక్నోతో ఆడిన మ్యాచ్‌లోనూ ఎంఐ 12 పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. లక్నో మ్యాచ్‌లో తిలక్ వర్మ ‘రిటైర్డ్ ఔట్’ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.…