తమిళ వెటరన్ స్టార్ హీరో… ది కెప్టెన్ విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ విజయకాంత్… ఈరోజు తుది శ్వాస విడిచారు. తమిళ సినీ అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు విజయకాంత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విజయకాంత్ మరణం పట్ల స్పందించారు. “విజయకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి. విజయకాంత్ గారు కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను. విజయ్ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని…