ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తుతోంది. ఆందోళనలతో ద్వీపదేశం అట్టుడుకుతోంది. ఇప్పటికే ఆందోళనకు బయపడి దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స పారిపోయారు. రాజధాని కొలంబోలో అధ్యక్షభవనంతో పాటు సెక్రటేరియట్ను ముట్టడించారు నిరసనకారులు. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని పదవకి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేశారు. శ్రీలంకలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి చర్చించేందుక అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు రణిల్. ఈ సమావేశానికి అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించారు. ఈ…