ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనంటూ చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీలో పదవలు నుంచి నేతల తొలగింపు, రాజీనామా పర్వం కొనసాగుతుందనే ప్రచారం సాగుతోంది.. దానిపై ఆ పార్టీ నేతలే స్వయంగా మీడియా ముందుకు రావడం చర్చగా మారింది.. అయితే, మా పార్టీలో ఎవరూ రాజీనామాలు చేయలేదు అంటున్నారు.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగస్తుల జీతాలకు ఒక డేట్ లేకుండా చేసిందని ఆరోపించారు..…