Water Storage at Dams: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 893 క్యూసెక్కులుగా నమోదు కాగా, అవుట్‌ఫ్లో పూర్తిగా నిలిచింది. జలాశయానికి సంబంధించిన పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 835.20 అడుగుల నీటిమట్టం ఉంది. అలాగే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 55.3581 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇటీవల వర్షాలు తగ్గిన నేపథ్యంలో జలాశయంలోకి వరద ప్రవాహం తక్కువగా…