MLC Kavitha : బీసీల హక్కుల కోసం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల జరుగుతున్న వివక్షను ఆమె తీవ్రంగా ఎండగట్టారు. “ఇది ప్రజాస్వామ్య దేశమా?” అనే ప్రశ్నతో ఆమె వ్యాఖ్యలు ప్రారంభమయ్యాయి. కవిత వివరించిన దయనీయ సంఘటనలో, శ్రీరామనవమి సందర్భంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికారాం జుల్లి రామాలయాన్ని దర్శించుకెళ్తే, ఆలయం మైలపడిందని అభిప్రాయపడుతూ సంప్రోక్షణ…