Liquor Stores: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ విధానంలో అర్హులను బహిరంగంగా ఎంపిక చేస్తారు. ఈ లక్కీ డ్రా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు, పోలీసులు, ప్రత్యేక అధికారుల సమక్షంలో కొనసాగుతుంది.
మద్యం షాపుల కేటాయింపుల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించింది.. అయితే, మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఖమ్మం జిల్లాకు చెందిన రవికాంత్ ఈ రిజర్వేషన్లను సవాల్ చేస�