India-Maldives Row: ఇండియా, మాల్దీవుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీపై అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియా ప్రజలు మాల్దీవులపై తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మాల్దీవ్స్ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనా అనుకూలంగా వ్యవహరించడం, భారత్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అయ్యాయి.
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా కొంత మంది ఖైదీలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. జీవిత ఖైదు అనుభవిస్తూ అనారోగ్యం, వృద్ధాప్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఖైదీల శిక్షాకాలాన్ని తగ్గిస్తూ క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో జరిగిన దళాల పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన వీక్షకులను అబ్బురపరిచింది. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చప్పట్లు కొట్టి ప్రశంసించారు.
FNCC Flag Hoisting on Republic Day: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ 75 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరి రావు జెండా ఆవిష్కరణ చేసి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి FNCC దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన క్లబ్ గా దినదినాభివృద్ధి చెందుతున్నట్టు వెల్లడించారు. ఆ అనంతరం సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ టి రంగారావు, కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ, ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే…
Republic Day Sales : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు త్రివర్ణ పతాకాలతో కళకళలాడాయి. ప్రజలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చాలా షాపింగ్ చేసారు. దీని కారణంగా కొనుగోలు రికార్డు గతేడాది మించిపోయింది.
CM Revanth Reddy: తెలంగాణ CM రేవంత్ నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగరేశారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Emmanuel Macron: భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వబోతున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్. గురువారం ఆయన భారతదేశానికి వచ్చారు. రాజస్థాన్ జైపూర్ సిటీని సందర్శించారు. జైపూర్ నగరంలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాని నరేంద్రమోడీ, అధ్యక్షుడు మక్రాన్కి స్వాగతం పలికారు, ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. భారతదేశ పర్యటనకు వచ్చిన మక్రాన్ రెండు రోజుల పాటు దేశంలో పర్యటించనున్నారు. తొలిరోజు జైపూర్ సందర్శనతో ఆయన పర్యటన ప్రారంభమైంది.
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని కొనియాడారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యవస్థ పాశ్చాత్య ప్రజాస్వామ్య భావన కంటే చాలా పురాతనమైనది. అందుకే భారతదేశాన్ని "
విశాఖలో బీజేపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో రేపు ఘనతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు(శుక్రవారం) ఉదయం ఆరు గంటలకు ఆర్కే బీచ్ రోడ్డులో రిప్లబిక్ ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నాలుగు వందల మీటర్లు పొడువైన జాతీయ జెండాతో వాక్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు పిల్లలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే.. సాయంత్రం టాలీవుడ్ సింగర్ అరుణ్ కౌండిన్య,…
రేపు జనవరి 26 న రిపబ్లిక్ డే సందర్బంగా దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడానికి ప్రజలు సిద్ధం అవుతున్నారు.. మరోవైపు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు, బార్లు మూసివేయనున్నారు. జనవరి 26 వైన్ షాపు బంద్ అనే బోర్డులు మద్యం షాపుల ఎదుట దర్శనం ఇవ్వటంతో ఈరోజు సాయంత్రం నుంచే మందుబాబులు వైన్ షాపుల ముందు జనాలు క్యూ కడుతున్నారు.. హైదరాబాద్ సిటీలో వైన్ షాపుల దగ్గర రద్దీ నెలకొంది. పబ్లిక్…