పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్, మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు సోమవారం ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య నేడు రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల్లో జూన్ 1న ఓటింగ్ నిర్వహించగా.. అ ఫిర్యాదులు రావడంతో మళ్లీ ఇక్కడ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఎన్నికల తర్వాత కూడా రెండు రోజులపాటు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపించింది.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రశాంతంగా ముగిసింది. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 8 కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని సోమవారం ఆదేశించింది.