RBI: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే నాలుగు సార్లు రెపో రేటును పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మరోసారి కూడా వడ్డీ రేటును పెంచుతుందని చాలా మంది విశ్లేషకులు ముందుగానే భావించారు. కొంత మంది అనలిస్టులేమో ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకూ రెపో రేటు పెంపు ఉండబోదని, ఈ విషయంలో ఆర్‌బీఐ పాటిస్తున్న విరామం ఈ రెండు నెలలు కూడా కొనసాగుతుందని అనుకున్నారు.
Today (09-02-23) Business Headlines: రెండేళ్లలో 1700 విమానాలకు ఆర్డర్లు: రానున్న రోజుల్లో విమాన ప్రయాణాలు పెరిగే అవకాశం ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చితే ఇండియాలోనే ఎక్కువని కన్సల్టెన్సీ కంపెనీ.. కాపా.. పేర్కొంది. ఈ డిమాండ్ నేపథ్యంలో భారత విమానయాన రంగ సంస్థలు ఒకటీ రెండేళ్లలో 15 వందల నుంచి 17 వందల వరకు కొత్త విమానాల కోసం ఆర్డర్లు పెడతాయని తెలిపింది. ఎయిరిండియా ఒక్కటే 500 విమానాలు కొనే సూచనలున్నాయని వెల్లడించింది.
EMIs High-No Extension: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మరోసారి రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే లోన్లు తీసుకున్నవాళ్ల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. రుణం తిరిగి చెల్లించే వ్యవధి పెరుగుతుందా?.. లేక.. ఈఎంఐ మరింత భారంగా మారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ రెపో రేటు పెరిగిన ప్రతిసారీ వినియోగదారులు ఈఎంఐ అమౌంట్‌ని పెంచుకోకుండా లోన్ రీపేమెంట్ డ్యూరేషన్‌ని పెంచుకునేవారు.
మరోసారి వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)… రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు పెంచేసింది.. దీంతో.. ఇప్పటి వరకు 5.4 శాతంగా ఉన్న వడ్డీ రేటు.. 5.9 శాతానికి పెరిగింది… ఈ ఏడాదిలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగో సారి.. ఇక, మే నెల నుంచి ఇప్పటి దాకా 140 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ.. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు వడ్డీ రేట్లను పెంచినట్టు ఆర్బీఐ…