స్పీకర్ ఛాంబర్, మండలి భవనం మరమ్మత్తులపై మంత్రులు సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్‌లు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్, రహదారులు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన పనులపై స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు రివ్యూ చేశారు.
వైకుంఠ ఏకాదశిలోపు ఘాటు రోడ్ పనులు పూర్తిచేస్తామంటోంది టీటీడీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామంటోంది. తుఫాన్ కారణంగా ఏర్పడిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్డు పాడైంది. తిరుమల రెండో ఘాట్ మరమ్మతులు ఈ నెలాఖరులోపు పూర్తిచేసి, వైకుంఠ ఏకాదశిలోపు వాహన రాకపోకలకు అనుమతివ్వాలని ఇంజనీరింగ్ అధికారులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 7,8,9,14,15వ కిలోమీటర్ల వద్ద త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఐఐటీ…