టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ బిగ్ స్టార్ హీరో అన్న విషయం అందరికి తెలిసిందే.. ఆయన సినిమాలతో పాటు పాలిటిక్స్ లో కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఆయన వారసుడు అయిన అకీరా నందన్ హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.అకీరా హీరోగా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తారా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అకీరా కూడా పవన్ దారిలో నడుస్తున్నాడు.. ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో వున్నాడు అకీరా…