Darshan : రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్ తుగుదీప శుక్రవారం బెంగళూరులోని కంగేరిలోని ఆసుపత్రిలో చేరారు. వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. ఆయన వెంట భార్య విజయలక్ష్మి కూడా ఉన్నారు. వైద్య కారణాల వల్ల కన్నడ నటుడు కోర్టు నుండి బెయిల్ పొందారు. అక్టోబర్ 30న కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు వైద్యపరమైన కారణాలతో ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తమ అభిమాని రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఆరోపణలపై నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడలను అరెస్ట్ చేశారు.
Read Also:Israel-Iran: ఇజ్రాయెల్కు మరింత సైనిక సామగ్రిని అందిస్తున్న అమెరికా..
నటుడికి చికిత్స చేస్తున్న డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ్ శుక్రవారం మాట్లాడుతూ.. ఆయన వెన్ను, ఎడమ కాలి నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. అతని ఎడమ కాలు బలహీనంగా ఉంది. తర్వాత ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇంకా ఎలాంటి విచారణ ప్రారంభించలేదు. విచారణ తర్వాత మాత్రమే అతనికి సరిగ్గా ఏమి జరిగిందో తెలుస్తుంది. దర్శన్‌కు ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, రక్తపరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్ గౌడ తెలిపారు. అతని మునుపటి ఎంఆర్ఐ ఫిల్మ్‌లు,పరీక్ష నివేదికలు మాకు అందలేదని మళ్లీ ఎంఆర్ఐ చేయవలసి ఉంటుందని డాక్టర్ చెప్పారు. ఎంఆర్‌ఐ రిపోర్టు వచ్చిన తర్వాత ఆపరేషన్ అవసరమైతే చేస్తాం.. లేకపోతే ఫిజియోథెరపీ చేస్తారు.
Read Also:Bhadradri: భద్రాద్రికి కార్తీక శోభ.. శివాలయంలో నేటి పూజలు..
దర్శన్ తన రెండు కాళ్లు తిమ్మిరితో బాధపడుతున్నారని, మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స కోసం అనుమతి కోరినట్లు నటుడి లాయర్ పేర్కొన్నారు. బళ్లారి కేంద్ర కారాగారంలోని వైద్యుల నుంచి పొందిన సీల్డ్ మెడికల్ రిపోర్టులను, నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగాధిపతి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. అక్టోబర్ 30న జైలు నుంచి విడుదలైన దర్శన్ తూముకూరులోని హోసకెరె గ్రామంలోని తన భార్య విజయలక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఆయన అక్కడికి చేరుకున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడి తొక్కిసలాట లాంటి పరిస్థితిని సృష్టించారు. దీన్ని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది నానా తంటాలు పడాల్సి వచ్చింది. హైకోర్టు షరతులను ప్రస్తావిస్తూ.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన కుమారుడు వినీష్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.