Darshan: యాక్టర్ దర్శన్‌కి కోర్టులో చుక్కెదురు.. అందుకు నో చెప్పిన కోర్టు..
- దర్శన్ కేసులో కీలక పరిణామం..
- ఇంటి భోజనానికి నో చెప్పిన కోర్టు..
- హత్యా నిందితుడికి ఈ సౌకర్యాలు ఇవ్వలేమని వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan: కర్ణాటకలో పాటు యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది రేణుకా స్వామి హత్య కేసు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న దర్శన్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసులో అతని లివింగ్ పార్ట్‌నర్ పవిత్ర గౌడలతో పాటు నిందితులంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తనకు ఇంటి భోజనం కావాలని పిటిషన్ దాఖలు చేసిన దర్శన్‌కి కోర్టులో చుక్కెదురైంది. అతని పిటిషన్‌ని బెంగళూర్ కోర్టు గురువారం తిరస్కరించింది. తనకు దుస్తులు, పరుపు, పుస్తకాలను అనుమతించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. దీనికి సంబంధించి మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని ఈ నెల ప్రారంభంలో కర్ణాటక హైకోర్టు దర్శన్‌ని ఆదేశించింది.
Read Also: Maldives – India: మాల్దీవులకు భారత్ భారీ షాక్.. దురహంకారానికి కళ్లే
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
జైలులో ఆహారం జీర్ణించుకోలేకపోతున్నానని, బరువు కూడా తగ్గానని దర్శన్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. డయేరియాతో బాధపడుతున్నానని, జైలు అధికారులు ఫుడ్ పాయిజనింగ్ కేసుగా నిర్ధారించారని అందులో ప్రస్తావించారు. దర్శన్ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు, జైలు నిబంధనలను ఉటంకిస్తూ, నటుడు కోరిన సౌకర్యాలను హత్యా నిందితుడికి ఇవ్వలేమని పేర్కొంది.
దర్శన్ అభిమాని అయిన చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి(33), దర్శన్ సన్నిహితురాలైన పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడనే కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. జూన్ 09న బెంగళూర్‌కి స్వామిని రప్పించి దర్శన్, అతని సహాయకులు దాడికి తెగబడ్డారు. దెబ్బలకు తట్టుకోలేక అతను మరణించాడు. పోస్టుమార్టం నివేదికలో అతడిని కరెంట్ షాక్‌కి గురిచేయడంతో పాటు రక్తస్రావం కావడంతో మరణించనట్లు తెలిపింది. ఈ కేసులో నెంబర్ 1 నిందితురాలిగా పవిత్ర గౌడ ఉంది. ఆమె నిందితులను ప్రేరేపించి వారిని హత్య కేసులో పాల్గొనేలా చేసిందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!