తెలంగాణలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. భాగ్యలక్ష్మీ ఆలయంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్థానిక నేత రషీద్ ఖాన్, చార్మినార్ వద్ద నమాజ్ చేసుకునేందుకు అనుమతి కోసం సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. భాగ్యలక్ష్మీ దేవాలయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు మాకు ఇష్ట దైవం అని..దేవాలయం గురించి ఎంత దూరమైనా వెళ్తామని.. మేం చార్మినార్ తొలగించాలని…