(మార్చి 6న నటి కృష్ణకుమారి జయంతి)తెలుగు చిత్రసీమలో పలువురు అక్కాచెల్లెళ్ళు నటీమణులుగా అలరించారు. అయితే వారిలో అక్కను మించిన చెల్లెలుగా పేరొందిన నటి ఎవరంటే ముందుగా కృష్ణకుమారి పేరే వినిపిస్తుంది. తన అక్క షావుకారు జానకి చిత్రసీమలో అడుగు పెట్టిన వెంటనే తానూ కెమెరా ముందుకు వచ్చారు కృష్ణకుమారి. నాటి మేటి హీరోల సరసన నాయికగా నటించి, అరుదైన విజయాలను సొంతం చేసుకున్నారామె. టాప్ స్టార్స్ తోనే కాదు అప్ కమింగ్ హీరోల సరసన కూడా హీరోయిన్…
(జనవరి 24న నటి కృష్ణకుమారి వర్ధంతి)అందాల రాజకుమారి పాత్రల్లో అలరించిన నాయికలు ఎందరో ఉన్నారు. కానీ, కృష్ణకుమారిలా మురిపించిన వారు అరుదనే చెప్పాలి. జానపద కథానాయకులుగా యన్టీఆర్, కాంతారావు రాజ్యమేలుతున్న రోజుల్లో వారి సరసన కృష్ణకుమారి పలు చిత్రాలలో నాయికగా నటించి మురిపించారు. ముఖ్యంగా బి.విఠలాచార్య జానపద చిత్రాల్లో అనేక సార్లు రాజకుమారిగా నటించి మురిపించారు కృష్ణకుమారి. అందుకే ఈ నాటికీ అందాల రాజకుమారిగా జనం మదిలో నిలచిపోయారు కృష్ణకుమారి. కృష్ణకుమారి 1933 మార్చి 6న జన్మించారు.…