Vladimir Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్ది గంటల్లో భారత్ భూమిపై దిగబోతున్నారు. ఆయన ఓ ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నారు. పుతిన్ ప్రయాణిస్తున్న స్పెషల్ విమానం IL-96-3000 PUE ను ‘ఆకాశంలో ఎగిరే కోట’ అని అంటారు. ఈ విమానం మీద మిసైల్స్ సైతం ప్రభావం చూపలేవు. పుతిన్ భద్రత అత్యంత హైటెక్ గా ఉంటుంది. పుతిన్ తల నుంచి పాదాల వరకు ప్రత్యేక దుస్తులు, భద్రత పరికరాలు ధరిస్తారు.
Vladimir Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక విమానం కొన్ని గంటల్లో భారతదేశంలో ల్యాండ్ అవుతుంది. భారతదేశం-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పుతిన్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. ఆయన 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారత గడ్డపై దిగిన తర్వాత.. పుతిన్ ప్రత్యేక భద్రతా కవచంలో ఉంటారు. భారీ భద్రత మధ్య పుతిన్ రెండు రోజుల పర్యటన కొనసాగనుంది.