రాజస్థాన్‌లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉదయం ప్రార్థన సమయంలో ఇస్లామిక్ శ్లోకాలు (కల్మా) పఠించమని హిందూ విద్యార్థులను ఉపాధ్యాయులు బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోటలోని బక్షి స్ప్రింగ్‌డేల్స్ స్కూల్‌లో జరిగిన ఈ సంఘటన హిందూ సంస్థలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే భారీ నిరసనలు చేపడతామని సంఘాల సభ్యులు హెచ్చరించారు. అయితే, ఆ ఫుటేజ్ చాలా సంవత్సరాల పాతదని పాఠశాల సిబ్బంది తెలిపారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అన్యమత ప్రచారంపై అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారు. బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.
తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ పెట్టడం ఆందోళనకు దారి తీసింది. ఆధ్యాత్మిక నగరంలో అపచారం జరిగిందని హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. ఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశాయి.