మరికొన్ని రోజుల్లో 5 జీ స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం కాబోతోంది. ఇదే సమయంలో రిలయన్స్ జియో దుమ్మురేపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దూకుడు ప్రదర్శించింది. భారతదేశ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ శుక్రవారం తన ఎప్రిల్-జూన్ తొలి త్రైమాసిక లాభాలను ప్రకటించింది. తొలి త్రైమాసికానికి రూ. 21,873 కోట్ల ఆదాయాలను నమోదు చేసింది. నికర లాభం 24% పెరిగింది.