ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కోర్టుల్లో వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సతమతం అవుతున్న ఆ నేతలకు తాజాగా ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారంలో కూడా న్యాయస్థానంలో చుక్కెదురైంది. ప్రధాని మోడీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్‌కు జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి భారీ షాక్ తగలినట్టైంది.…