ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు కొత్త కష్టం వచ్చింది. ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ స్లాట్ రద్దుచేసుకున్న వారికి ఏడాది గడిచినా ఇంకా డబ్బులు అందలేదు. ఇలా దాదాపు 2 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉండడంతో ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూపులు తప్పడం లేదు. గత ఏడాది అక్టోబర్లో ధరణి సేవలు తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అదే నెల 28 నుంచి తహశీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం మొదట స్లాట్…