మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, కేంద్ర బడ్జెట్ 2024లో మీకు ఒక పెద్ద శుభవార్త అందించింది. బయటి దేశం నుంచి మన దేశంలోకి వచ్చే ఫోన్లపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. దీంతో విదేశాల నుంచి వచ్చే ఫోన్లు ఇప్పుడు ఆరు శాతం మేర తగ్గనున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో.. కేంద్ర ప్రభుత్వం షిప్‌మెంట్ ద్వారా బయటి నుండి వచ్చే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించింది.
ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలుపై ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. ఇప్పుడు వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు 31.3 శాతం జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. వాషింగ్ మెషీన్లు, మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, గృహోపకరణాలు, యూపీఎస్ తదితర ఎలక్ట్రానిక్స్, వస్తువులు మొదలైన వాటిపై జీఎస్టీని తగ్గించి సామాన్య ప్రజలకు చిరునవ్వు తీసుకొచ్చింది ప్రభుత్వం.