Red Sandalwood smuggling: ఎర్ర చందనం స్మగ్లింగ్ దందా ఆగడం లేదు. శేషాచలం అడవుల నుంచి చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి ద్వారా తరలిపోతోంది. కర్ణాటకకు కూతవేటు దూరంలో ఉన్న గ్రామాలను స్మగ్లర్లు స్టాక్ పాయింట్లుగా పెట్టుకుంటున్నారు. అక్కడి నుంచి యథేచ్ఛగా విదేశాలకు తరలిస్తున్నారు. భాస్కర్ రెడ్డి అనే ఇంటర్నేషనల్ స్మగ్లర్ కనుసన్నల్లో దందా నడుస్తోందంటున్నారు పోలీసులు. ఇన్నాళ్లూ కాస్త స్తబ్దుగా ఉన్న ఎర్ర చందనం దందా.. మళ్లీ చిగురు తొడిగింది. ఇటీవల బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు.. ఎర్రచందనం అక్రమ రవాణాకు పోలీస్ స్టిక్కర్లు తమ వాహనాలకు వేసుకొని మరి స్మగ్లింగ్ చేస్తుండగా కల్లూరు రైల్వే బ్రిడ్జి సమీపంలో అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు.. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లు తిరుపతి రుయా ఆసుపత్రిలో సమీపంలో ఉండే ఆంబులెన్స్ డ్రైవర్లుగా గుర్తించారు..
ఇటీవల విడుదలైన పుష్ఫ సినిమాలు అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్పరాజ్ అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కస్టమ్స్ శాఖలో పని చేస్తున్న ముగ్గురు పుష్పరాజ్ అవతారం ఎత్తారు. బాధ్యతయుతమైన పోస్టుల్లో ఉండి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు తెరలేపారు ఆ అధికారులు.. సీబీఐ చొరవతో ఆ అధికారులు గుట్టు బయటపడింది. కస్టమ్స్ అధికారులు ఓ ముఠాతో కలిసి ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు తెరలేపారు. దీంతో కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.…