తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది వరి దిగుబడిలో కొత్త రికార్డులను సృష్టించబోతుందని, 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడికి అవకాశం ఉన్నట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడిని చూడబోతున్నామని, అందులో 91 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసే అవకాశముందని చెప్పారు.