Global Economy's Ray of Hope: చైనా.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆ దేశం ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి కోలుకుంటోంది. కొవిడ్ జీరో పాలసీకి డిసెంబర్‌లో స్వస్తి చెప్పింది. రెండు నెలల కిందట తీసుకున్న ఈ నిర్ణయం చైనాను ఆర్థికపరంగా పూర్తి స్థాయిలో కుదుటపర్చలేదు. రియల్ ఎస్టేట్, తయారీ, ఎగుమతులు, కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ వంటి రంగాలు ఇంకా బలహీనంగానే కనిపిస్తున్నాయి. ఈ సెక్టార్లు మరింత కాలం ఇలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.