ప్రముఖ తమిళ నటుడు వివేక్ ఈ యేడాది ఏప్రిల్ 17వ తేదీ హఠాన్మరణం చెందారు. కమెడియన్ గా, సహృదయుడిగా చక్కని పేరు తెచ్చుకున్న వివేక్ మరణంతో తమిళ చిత్రసీమ ఒక్కసారి ఉలిక్కిపడింది. దానికి కారణం ఆయన చనిపోవడానికి ఒక రోజు ముందు కొవిడ్ 19కు వాక్సిన్ వేయించుకోవడమే! ఆయన మరణానికి వాక్సిన్ వేయించుకోవడం కారణం కాదని ఆరోగ్యశాఖ అప్పుడే వివరణ ఇచ్చింది. అయినా కొన్ని మీడియా సంస్థలు వాక్సిన్ వికటించి వివేక్ మరణించారంటూ ముమ్మరంగా ప్రచారం చేశాయి.…