రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసింది కరోనా మహమ్మారి. కోట్లాది మంది కూలీల పొట్టగొట్టింది.. లక్షలాది మంది వ్యాపారులను నట్టేట ముంచింది… సొంతింటి కలనూ దూరం చేసింది. ఆర్థిక మాంద్యంతో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న రియాల్టీ రంగాన్ని.. కోలుకోలేని కష్టాల్లోకి నెట్టింది కరోనా. నిత్యకళ్యాణం.. పచ్చతోరణం అన్నట్టుండే హైదరాబాద్ రియల్ రంగం.. కోవిడ్ కాటుతో విలవిల్లాడుతోంది. కరోనా తర్వాత ఊహించిందే జరిగింది. రియల్ బుడగ పేలుతోంది. హైదరాబాద్.. మన దేశమే కాదు..ప్రపంచవ్యాప్తంగా రియల్ రంగం సంక్షోభంలో ఉందని చైనాను చూస్తే…