Reactor Blast: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి పరిశ్రమ తునాతునకలైంది. ఇప్పటివరకు 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. Read Also:Kubera : పదేళ్లకే…
అనకాపల్లిలోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు.. అయితే, ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి.. విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా బాధితులతోనూ మాట్లాడి సీఎం చంద్రబాబు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు…
AP Deputy CM: అనకాపల్లి జిల్లాలోని అచుత్యాపురంలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. అనకాపల్లి ప్రమాదం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ కిందకు రాదు అని తెలిపారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో నలుగురు మృతి చెందగా.. 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Reactor Blast: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడంలో ఉన్న ఎస్‌వీఆర్ ఫ్యాక్టరీలో ఆదివారం రియాక్టర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులోని ఓ కంపెనీలో రియాక్టర్ పేలింది. దీంతో భారీగా విషవాయువులు వెలువడ్డాయి. అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో.. దుర్వాసనతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వెలిమినేడు, పేరేపల్లి, పిట్టంపల్లి, బొంగోనిచెరువు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దగ్గు వాంతులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. రియాక్టర్ నుంచి వెలువడిన విషవాయువుల గురించి…