శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా ప్రేక్షలు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ఏడాదిన్నర క్రితం మొదలైంది. సినిమా అనౌన్స్‌మెంట్ అయితే మూడేళ్ల క్రితమే వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్‌తో ఉన్న అగ్రిమెంట్స్ కారణంగా ఆ…