కేసీఆర్ అసమర్థపాలనపై మండిపడ్డారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి డీపీఆర్ ఎందుకివ్వడం లేదన్నారు. డీపీఆర్ లేకుండా నీటి కేటాయింపులు లేకుండా ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఆర్డీఎస్‌పై కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది ? కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఏమైంది..? తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నీళ్లు, నిధులు,…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తారాస్థాయికి చేరి ఫిర్యాదుల వరకు వెళ్లింది.. జల విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణపై ఏపీ ఫిర్యాదు చేస్తే.. ఆర్డీఎస్ విషయంలో ఏపీపై తెలంగాణ ఫిర్యాదు చేసింది.. అయితే ఇవాళ రెండు రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు లేఖలు రాసింది.. ఇప్పటికే తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు లేఖ రాసిన కేఆర్ఎంబీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జల విద్యుత్ ప్రాజెక్టుల్లో..…