మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా మూవీకి మోస్ట్ హ్యపెనింగ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శంకర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి. శంకర్ రూపొందించిన ‘బాయ్స్’ సినిమాలో నటించిన తమన్, ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీకి సంగీతం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.…