Business Headlines 24-02-23: BWA-తెలంగాణ ఒప్పందం: తెలంగాణ రాష్ట్రాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానంలో అగ్ర స్థానంలో నిలబెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ల శాఖ శ్రీకారం చుట్టింది. వెబ్3 టెక్నాలజీ సంస్థ భారత్ వెబ్3 అసోసియేట్స్.. BWAతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం BWA కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో సదస్సులు, ప్రదర్శనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
India Growth: మన దేశం వచ్చే ఏడాది 5 శాతం గ్రోత్ సాధించినా గొప్ప విషయమేనని, అదే జరిగితే మనం అదృష్టవంతులమేనని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ అన్నారు. ఈ ఏడాదితో పోల్చితే వచ్చే సంవత్సరం మరింత కష్టంగా గడవనుందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి వేగం మందగించబోతోందని అంచనా వేశారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూపోతున్నాయని, అందుకే గ్రోత్ పడిపోనుందని అభిప్రాయపడ్డారు.