రాజోలు వైసీపీకి కోఆర్డినేటర్ కావాలట. పార్టీ సీనియర్ నేతలే అధిష్ఠానాన్ని కోరినట్టు టాక్. వాస్తవానికి అక్కడ పార్టీ ఇంఛార్జ్ ఉన్నారు. మరోపార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సైతం వైసీపీకి సాయం పడుతున్నారు. అయినప్పటికీ ఎందుకు ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది? అసలు రాజోలు వైసీపీలో ఏం జరుగుతోంది? రాజోలు వైసీపీలో హైడ్రామా..! తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం వైసీపీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ కోఆర్డినేటర్ పెద్దపాటి అమ్మాజీ కొద్దిరోజులుగా రాజోలుకు చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోతున్నారట.…