Women’s Safety Awareness program in AP: మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను, చట్టాల సమాచారాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చాలని, ప్రతివారం విద్యార్థినిలకు వీటిపై తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ సహకారంతో రాజమండ్రిలో జరిగిన మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమానికి డాక్టర్ శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…
Rayapati Sailaja: అనంతపురం జిల్లా రామగిరిలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా ఓ మైనర్ బాలికపై లైంగిక దాడులు జరుగుతున్నాయని విచారకరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా “కాలం బాగోలేదు… అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా అనుమానాలు ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలి” అంటూ ఆమె…
రౌడీ షీటర్ల దాడికి గురైన కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు.. ఐతనగర్ లో చిరంజీవి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించిన శైలజ.. కానిస్టేబుల్ కుటుంబంతో మాట్లాడి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు..