ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్‌ఆర్‌ఎస్) డిమాండ్ చేసింది. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ప్రయత్నించడం సరికాదని ఆర్‌ఆర్‌ఎస్ అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. దీనికంటే అమరావతి రాజధానిగా ఉంటేనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాయలసీమ ప్రాంత ప్రయోజనాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని, కేంద్ర…