పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఇవాళ ప్రారంభమైన మొదటి టెస్టులో ఇంగ్లీష్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్టు మ్యాచ్ తొలిరోజే 500 పరుగులు చేసిన మొదటి జట్టుగా రికార్టు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు తొలి రోజే 4 వికెట్లు కోల్పోయి 506 పరుగుల స్కోర్ చేసి, క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది.