మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారం ఎత్తుతూ చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీలో చిరు ‘వాల్తేరు వీరయ్య’గా నటిస్తుంటే, మాస్ మహారాజ రవితేజ ‘విక్రం సాగర్’గా నటిస్తున్నాడు. ఈ ఇద్దరు మెగా మాస్ హీరోలు ఒకే స్క్రీన్ పైన కనిపిస్తుండడం సినీ అభిమానులకి కిక్ ఇచ్చే విషయం. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే ఆడియన్స్ ని మెప్పించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర యూనిట్, రీసెంట్ గా రవితేజ టీజర్…