Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మేడ్ స్టార్ గా రవితేజకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, సపోర్టింగ్ రోల్స్, సెకండ్ హీరో.. హీరో, స్టార్ హీరో, మాస్ మహారాజా వరకు ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం.