అప్పు తీర్చేందుకు ఓ మహిళ తన 10 తులాల బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టేందుకు బయలుదేరింది. మార్గమధ్యంలో ఒక మంచి పని చేసింది. తీరా బ్యాంకుకు చేరుకున్నాక చూస్తే, ఆభరణాల సంచి కనిపించలేదు. ఆ మహిళ ఎంత వెతికినా దొరకలేదు. దీంతో.. పోలీసుల్ని ఆశ్రయించగా, అసలు దొంగలు ‘ఎలుకలు’ అని తెలిసి అవాక్కయ్యారు. తిరిగి ఆ సంచిని వెతికి స్వాధీనం చేసుకోవడమూ జరిగింది. డ్రమటిక్‌గా అనిపించే ఈ ఆభరణాల చోరీ కథలోకి వెళ్తే.. గోరేగావ్‌లోని గోకుల్‌ధామ్ కాలనీలో…