రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డుల్లో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలుమార్లు సూచనలు ఇచ్చినా, ఇప్పటికీ చాలా మంది ఈ ప్రక్రియను పూర్తిచేయకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయని యూనిట్లకు రేషన్ సరఫరా నిలిపివేస్తామని మరోసారి హెచ్చరించారు. రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్…