Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గీతా గోవిందం సినిమాతో తెలుగుతెరకు పరిచయమై.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక రష్మిక కు వివాదాలు కొత్త కాదు.. ట్రోల్స్ లెక్క లేదు. నిత్యం ఏదో విధంగా ఆమె ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే ఉంటుంది.