Ownly: బైక్ టాక్సీలకు ప్రసిద్ధి చెందిన భారతీయ రైడ్ హైలింగ్ కంపెనీ ర్యాపిడోఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలో అడుగుపెట్టింది. ఓన్లీ (Ownly) అనే కొత్త సర్వీస్‌ను బెంగళూరులో పరీక్షాత్మకంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. ఇది బెంగళూరులోని బైరసంద్ర, తవరేకెరే, మడివాల (BTM లేఅవుట్), హుసూర్ సర్జాపుర రోడ్ (HSR లేఅవుట్), కొరమంగల వంటి కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఈ సర్వీస్‌ను ర్యాపిడో యొక్క పూర్తి యాజమాన్యంలోని సబ్‌సిడియరీ Ctrlx Technologies ద్వారా…