Rapaka Varaprasad: వైరల్‌గా మారిన ఎమ్మెల్యే రాపాక వీడియో.. దొంగ ఓట్లతోనే గెలిచా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapaka Varaprasad: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. దీంతో.. మరోసారి వైరల్ గా మారిపోయింది రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో.. అయితే, గతంలో తాను సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే రాపాక.. చింతలమోరి గ్రామంలో నా ఇంటి వద్ద పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు పడేవన్నారు.. నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేసేవారు.. దీంతో, చింతలమోరి గ్రామంలో నాకు మెజారిటీ ఏడు నుంచి ఎనిమిది వందల వరకు వచ్చేదంటూ.. అదేదో గొప్ప కార్యం అయినట్టుగా చెప్పుకొచ్చారు.
Read Also: YS Viveka Murder Case: సీబీఐ తీరుపై సుప్రీం ఆగ్రహం.. కీలక ఆదేశాలు
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
కాగా, ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.. గతంలో చింతలమూరి గ్రామ సర్పంచ్ గా పనిచేశారు రాపాక, నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తనకు పది కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిదంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన వీడియో వైరల్‌గా మారగా.. మరోవైపు.. దొంగ ఓట్లతోనే తాను గెలిచానంటూ ఆయన పేర్కొన్న వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే, ఇటీవల వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రాపాక ఉత్సాహంతో మాట్లాడారు… అదే సమయంలో నోరుజారి తాను సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని చెప్పుకొచ్చారు.. ఓవైపు టీడీపీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. దీంతో అంతర్వేదిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యల వీడియోలను ఎవరో కావాలనే ఒక్కొక్కటిగా వైరల్ చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు బయటపెట్టినా.. ఎవరు వైరల్ చేసినా.. ఎమ్మెల్యే రాపాక ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. కాగా, గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత వైసీపీకి దగ్గరైన విషయం విదితమే.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..