శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్, జగపతి బాబు లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, నేడు నటుడు రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా ‘మహా సముద్రం’ చిత్రం నుండి ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర…
తండ్రి అడుగుజాడల్లో తనయులు పయనించడం చిత్రసీమలో పరిపాటి అయిపోయింది. ముఖ్యంగా నటుల వారసులు నటనవైపే మొగ్గు చూపుతున్నారు. ఆ మాటకొస్తే నిర్మాతలు, దర్శకులు, సాంకేతికనిపుణుల వారసులు కూడా నటనపైనే మోజు పెంచుకుంటున్నారు. ఇక నటవిరాట్ గా జనం మదిలో నిలచిన రావు గోపాలరావు తనయుడు రావు రమేశ్ సైతం నాన్న బాటలో పయనించి, జేజేలు అందుకుంటున్నాడు. వాచకాభినయంలో భళా అనిపించిన రావు గోపాలరావు తనయునిగా రావు రమేశ్ కూడా తనదైన డైలాగ్ యాక్సెంట్ తో జనాన్ని ఇట్టే…