దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా దేశంలో మరో ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి కరోనా బారిన పట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పుదుచ్చేరిలో అన్నాడీఎంకే కూటమి విజయం సాధించింది. ఆ కూటమి నుంచి రంగస్వామిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. నాలుగురోజుల…